V1News Telangana

best news portal development company in india

ఏక చక్రేశ్వర శివాలయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు .,.

SHARE:

ఏక చక్రేశ్వర శివాలయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు

బోధన్
బోధన్ పట్టణంలో నీ ఏక చక్రేశ్వర శివాలయంలో శుక్రవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన అభిషేకం పూజా కార్యక్రమాల్లో పాల్గొని కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగామాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ. సంవత్సరమునకు ఒకసారి కార్తీక మాసంలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో పూజల నిర్వహిస్తుంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరూ సుఖ సంతోషాలతో ఉంటే పంటలుసమృద్ధిగా పండిస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థించానని అన్నారు. పాఠశాలల లోని అధ్యాపకులు విద్యార్థులకు నాణ్యమైన అందించాలని. విద్యార్థులు విద్యావంతులుగా ఎదిగే విధంగా వారిని తీర్చిదిద్దాలని సూచించారు. మారుతున్న టెక్నాలజీ కి అనుకూలంగా విద్యను బోధించాలని భారతదేశంలోని విద్యావంతులు విద్యార్థులు చైనా దేశంతో పోటీపడే విధంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి శరత్ రెడ్డి. ఏసీపి శ్రీనివాస్ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంత్ చారి. డిసిసి డెలిగేట్ గంగా శంకర్ గ్రంథాలయం చైర్మన్ రాజిరెడ్డి. తాహెర్ బిన్ హమ్దాన్. కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి. నాయకులు. ఆదినారాయణ. ఎల్లయ్య యాదవ్. ఆలయ కమిటీ.సభ్యులు భక్తులు. పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india