V1News Telangana

best news portal development company in india

లగచర్ల ఘటనను కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ లు రాజకీయాలు చేయడం దురదృష్టకరం……

SHARE:

-ఫార్మాసిటీ ఏర్పాటుపై ప్రభుత్వం తమ మొండి వైఖరి మానుకోవాలి

-బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమాయక ప్రజలపై చేయించిన దాడులు తెలంగాణ సమాజం మర్చిపోలేదు

-ప్రభుత్వం రైతుల నుండి భూసేకరణ బలవంతంగా నిర్వహించడం అమానుషం

– చందూరి హన్మాండ్లు బీజేపీ కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: కొడంగల్ నియోజకవర్గం లోని లగచర్లలో రైతులపై మరియు ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడులను వ్యతిరేకిస్తూ బిజెపి కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మండ్లు మాట్లాడుతూ.. గత 8 నెలలుగా ఫార్మాసిటీ ఇక్కడ ఏర్పాటు చేయొద్దని అక్కడ నివసిస్తున్న ప్రజలు మరియు రైతులు ఉద్యమాలు చేసినప్పుడు పట్టించుకోని బిఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలు ఈ సంఘటన విషయంలో రాజకీయాలు చేయడం దురదృష్టకరం అన్నారు. ఈ ఫార్మా సిటీ ఏర్పాటు కొరకు సుమారుగా 1500 ఎకరాలు అవసరం ఉండగా.. దానిలో కేవలం 200 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంది.. మిగతా 1300 ఎకరాల భూమిని ఐదు గ్రామాలకు సంబంధించిన రైతులది అని తెలిపారు. ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటి నుండి కూడా అక్కడి ప్రజలు ఫార్మాసిటీ ఏర్పాటు చేయవద్దని చెప్పి ప్రజలు ప్రాధేయపడినప్పటికీ ప్రభుత్వం తన మొండి వైఖరితో ఏర్పాటు చేస్తామని నిర్ణయించుకోవడం వల్లనే ఈ సంఘటన జరిగిందని అన్నారు. ఈ సంఘటనలో ప్రభుత్వ అధికారులపై దాడులు జరగడం చాలా బాధాకరం.. ఈ సంఘటన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ లో జరగడం శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన హోంశాఖ బాధ్యతలు ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి పనితనానికి నిదర్శనంగా కనిపిస్తుంది అన్నారు. ఈ సంఘటన విషయంలో బిఆర్ఎస్ పార్టీ రాజకీయాల కొరకు రైతులను రెచ్చగొట్టడం మరియు తన అల్లుడి కొరకు ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి పట్టుబడడం వలన ఈ రెండు పార్టీలు ఆడే రాజకీయ ఆటలో అక్కడ నివసిస్తున్న ఐదు గ్రామాల రైతులు మరియు అమాయక ప్రజలు బలి అవుతున్నారన్నారు. ఈ పరిస్థితిని గమనిస్తుంటే ఇందిరమ్మ రాజ్యంలో జరిగినటువంటి ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులు, దళితులు, గిరిజనుల పై చేసిన అరాచకాలు తెలంగాణ సమాజం ఇప్పటికి మర్చిపోలేదు అని గుర్తు చేశారు. అక్కడ ఉన్నటువంటి రైతులు భూములు సేకరించేది ప్రభుత్వ సంస్థల నిర్మాణం కొరకు కాదు ముఖ్యమంత్రి అల్లుడు ఫార్మ కంపెనీల ఏర్పాటు కొరకు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. అదేవిధంగా అక్కడి రైతులు పచ్చని పంట పొలాలపై ఫార్మా విషం , నష్ట పరిహారం, ప్రజాభిప్రాయా సేకరణ వద్దు అని ముక్తకంఠంగా చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఏర్పాటు చేస్తామని చెప్పి దాడులకు పాల్పడడం.. అధికార దాహానికి నిదర్శనం అని అన్నారు. ప్రభుత్వం భూ సేకరణ రైతులు తమ ఇష్టపూర్వకంగా ఇస్తే స్వీకరించాలి కానీ బలవంతంగా లాక్కోవడం పద్ధతి కాదు అని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నుండి వైఖరి మానుకొని అక్కడున్నటువంటి ప్రజల కోరిక మేరకు ఫార్మాసిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india