V1News Telangana

best news portal development company in india

సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు వేగంగా పూర్తి చేయాలి……

SHARE:

-రిజర్వాయర్ ఆయకట్టు సస్యశ్యామలంగా ఉండాలి

-భవిష్యత్తు తరాల రైతులకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకోవాలి

-గిరిజనులు ,మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించే విధంగా ప్రణాళికతో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణం

-సిద్దాపూర్ రిజర్వాయర్ నా ప్రధాన ఆశయం

-ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ గ్రామీణ మండలం సిద్దాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ నిర్మాణ పనులపై సమంత శాఖ అధికారులతో గురువారం రోజు ప్రభుత్వ వ్యవసాయ శాఖ ప్రధాన సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సిద్ధాపూర్ రిజర్వాయర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ రిజర్వాయర్ పనులను వేగంగా పూర్తి చేయాలని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయ ఆధారితమని తెలిపారు. నియోజకవర్గంలో 70, 670 కుటుంబాలు ఉండగా అందులో 66,670 మంది రైతులు ఉన్నారన్నారు. అనగా 90 శాతం రైతు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గం లో మొత్తం 1,50,000 ఎకరాల సాగు భూమి ఉన్నదని అన్నారు. ఇందులో లక్ష ఎకరాలు నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఉన్నదన్నారు. సిద్దాపూర్ రిజర్వాయర్ నా ప్రధాన ఆశయం అని తెలిపారు. ఈ ప్రాంతంలోని 14 వేల ఎకరాల మిట్ట భూములకు పుష్కరణంగా నీళ్లు అందాలని అన్నారు. ఆర్థికంగా రైతులు అభివృద్ధి చెందాలని నా కల అన్నారు. భవిష్యత్తులో సిద్దాపూర్ రిజర్వాయర్ ఆయకట్టు సస్యశ్యామలంగా ఉండాలనేది నా ఉద్దేశమని తెలిపారు. రూ.200 కోట్ల రూపాయల వ్యయంతో ఒక టిఎంసి సమర్ధింతో నిర్మిస్తున్నామని అన్నారు. రిజర్వాయర్ కట్టతోపాటుగా పంట పొలాలకు నీరు అందించే కుడి,ఎడమ కాలువల పనిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు తరాల రైతులు సాగునీటికి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకోవాలని అన్నారు. గిరిజనులు, మిట్టప్రాంత రైతులకు సాగునీరు అందించాలని కష్టపడి, ప్రణాళికతో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మింప చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india