V1News Telangana

best news portal development company in india

అదుపుతప్పి బోల్తా పడిన ట్రాక్టర్.. డ్రైవర్ కు తీవ్ర గాయాలు…..

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ శివారులో గురువారం రోజు ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ కు తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. చించొల్లి గ్రామం నుండి ట్రాక్టర్ లో ఇసుక లోడ్ తీసుకెళ్లి ఖాళీ చేసి తిరిగి వస్తున్న క్రమంలో కిష్టాపూర్ గ్రామ శివారులో ఒక్కసారిగా అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ పురుషోత్తం కాళ్లు, చేతులు విరిగాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రుని హుటాహుటిన బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india