V1News Telangana

best news portal development company in india

కల్తీ కళ్ళు పై చర్యలు తీసుకునేది ఎప్పుడు

SHARE:

కల్తీ కళ్ళు పై చర్యలు తీసుకునేది ఎప్పుడు..


నిజామాబాద్ ఉమ్మడి జిల్లా
కల్తీ కళ్ళు పై చర్యలు తీసుకున్నది ఎప్పుడు అను ప్రజలు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. బోధన్ డివిజన్ పరిధిలోని మండలాలతో పాటు గ్రామ గ్రామాల్లో కల్తీకల్లు ఏరులై పారుతుందని దీనిపై చర్యలు తీసుకోవలసిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ మామూల మత్తులో మునుగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

చెట్టు నుంచి వచ్చిన స్వచ్ఛమైన కల్లును ఉదయం నుంచి సాయంత్రం దాకా కాయ కష్టాలు చేసిన వారు అతి తక్కువ ధరల దొరికే కల్లును సేవించి రాత్రిపూట సేద తీరుతారు.

అలాంటి స్వచ్ఛమైన కళ్ళు పేద ప్రజలకు అందించడంలో విఫలమవుతున్నారని, కృత్రిమ కళ్ళు, అందించడంతోపాటు హానికరమైన విష పదార్థాలు అల్ఫోసం, డైజోఫామ్ క్లోరోహైడ్రేట్ తో పాటు కుంకుడుగాయ రసంతో పాటు పలు హానికరమైన పదార్థాలతో పాటు గంజాయి రసం కూడా కలుపుతూ, పేద ప్రజలకు అందిస్తున్నారని దీంతో ఈ కళ్ళు తాగిన వారు అదే మత్తులో ఉంటున్నారని అది లేకపోయేసరికి పిచ్చివాడిగా మారుతున్నారని, వివిధ అనారోగ్యంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వీటిపై దృష్టి పెట్టకపోవడంతో పాటు మామూళ్ల మతులు మరుగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు,

బోధన్ డివిజన్లోని సంబంధిత శాఖ అధికారి, వీటిపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా వారికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు బహిర్గతంగా వినిపిస్తున్నాయి, ఇకపోతే గ్రామ గ్రామాల్లో బెల్ట్ షాపులు కూడా విచ్చలవిడిగా, ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామంలో బెల్ట్ షాపు లేని గ్రామాలు లేవని ఒక్కొక్క గ్రామంలో ఒకటికి బదులు సుమారు 20 వరకు ఉన్నాయని, అధిక రేట్లకు మద్యం విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులను కొల్లగొడుతున్నారని కల్తీ మందు విక్రయిస్తూ, ప్రజల ఆరోగ్య లతో చెలగాటమాడుతున్నారని వీటి పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూల మత్తులో మునుగుతున్నారని అటువైపు కన్నితి చూడడం లేదని ఇప్పటికైనా చూడాలని ప్రజలు ఆరోపిస్తున్నారు,

ఇప్పటికైనా వీటి పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india