జోరుగా కల్తీ కల్లు విక్రయాలు
కల్తీ తో జనం బేజార్..

నిజామాబాద్ జిల్లా
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంతోపాటు చుట్టుపక్క గ్రామాల్లో. కోటగిరి పోతంగల్ రుద్రూర్ . తో పాటు పలు గ్రామాలలో .కల్తీకల్లు విక్రయాలు జోరుగా జరుగుతున్నది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి, పేదలు తాగే కల్లులో విషపదార్థాలు కలుపుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కల్లులో కలిపే విష పదార్థాలు చేసే ఒక వ్యక్తిని పట్టుకున్న పరిస్థితులు చర్చని అంశంగా మారింది. తాగే కల్లులో హానికరమైన పదార్థాలు బేజారు అవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బోధన్ పట్టడంతో పాటు చుట్టుపక్క గ్రామాల్లో కోటగిరి పోతంగల్ రుద్రూర్ . తో పాటు పలు గ్రామాలలో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా జరుగుతున్న ప్రస్తుతులు నెలకొంటున్నాయి అని విమర్శలు వినిపిస్తున్నాయి .
వీటిపై చర్యలు తీసుకునే అధికారులు మాత్రం మామూల మత్తులో
మూను గుతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కల్తీకలులో అధికారులదే ప్రధాన పాత్ర
కల్తీ కల్లు విక్రయాల విషయంలో సంబంధిత శాఖ అధికారుల ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అనే విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి.
సంబంధిత శాఖ అధికారులే కల్లు విక్రయ దారులతో చేతులు కలిపి, వారు ఇచ్చే మామూళ్ల మత్తులో మునిగి, అటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు ఉన్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి సమాచారం సమందికులు ఇవ్వడం లేక తనిఖీల పేరుతో వస్తున్నట్టు ముందస్తుగా సమాచారం ఇవ్వడం వారిని అలాట్ చేయడం వారిని సేఫ్ చేయడమే అధికారులు లక్ష్యంగా పెట్టుకొని మామూలు తీసుకుంటూ, పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శలు లేకపోలేదు. బోధన్ పట్టణంతోపాటు చుట్టుపక్క గ్రామాలతోపాటు కోటగిరి మండలం రుద్రూరు మండలం వర్ని మండలం చందూరు మండలం మోస్రా మండలం నవపేట్ మండలం ఎడపల్లి మండలం రెంజల్ మండలం ఉమ్మడి జిల్లాల్లో అదేవిధంగా ప్రతి మండలం తో పాటు గ్రామ గ్రామాల్లో కల్తీకల్లు ఏరులై పారుతుందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కాయ కష్టం చేసి అలసిపోయే పేద ప్రజలు, తక్కువ ధరలో చెట్టు కళ్ళు దొరుకుతుందని ప్రజలు రాత్రిపూట సేద తీరడం కోసం, తెలంగాణ పాణిమైనా కల్లును సేవిస్తారు, పేద ప్రజల అవసరము ఆసరా చేసుకున్న కొంతమంది వ్యాపారస్తులు మంచి కల్లును ఇవ్వకుండా హానికరమైన పదార్థాలు కలిపిన కళ్ళు ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పలువురు మండిపడుతున్నారు. ఇవి తాగిన పేద ప్రజలు పలు వ్యాధుల బారినపడి మంచాన పడి పనికిరాకుండా పోతున్నారని మృత్యుకు దగ్గరవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కల్తీ కల్లుకు అలవాటు పడ్డ కల్లు ప్రియులు, పిచ్చివారుగా మారి మంచం పడుతున్నారని. ఎంతోమంది తమ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని విమర్శలు లేకపోలేదు. కళ్ళును విక్రయించే వ్యాపారస్తులు మాత్రం ప్రజల ఆరోగ్యం పక్కన పెట్టి డబ్బులే దేహంగా, ప్రతి ఊరికి సుమారు లక్షల రూపాయలు ఒక బోధన్ పట్టణంలోనే 30 నుంచి 40 లక్షలు ఇస్తున్నారు అంటే గ్రామ గ్రామాల్లో ఐదు నుంచి పది లక్షల వరకు ఇస్తున్నారు అంటే, ఈ విషయం మొన్న గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన గొడవ విషయంలో బయటపడిందని సమాచారం అంతేకానీ కల్పించి రాసింది కాదు, కల్తీకల్లు వ్యాపారం ఎంత జోరుగా కొనసాగుతుందో అర్థం చేసుకోవాలని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. మంచి కల్లును విక్రయించేవారు గ్రామం పై ఎందుకు డబ్బులు ఇస్తారని పలువురు ప్రశ్నించుకుంటున్నారు. కార్మికుల పరిస్థితి ఆగమగోచరంగా ఉందని వారి పేరుపై కొంతమంది వ్యాపారస్తులు కల్తీ కళ్ళు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అదేవిధంగా గీత కార్మికుల పేరును కొల్లగొడుతున్నారని విమర్శలు లేకపోలేదు, ప్రభుత్వాలు గీతా కార్మికులకు మంచి అవకాశం కల్పిస్తే మంచి కళ్ళు ప్రజలకు దొరుకుతుందనే విమర్శలు లేకపోలేదు. అనేక గ్రామాలలో లైసెన్స్ లేకుండా కల్లు విక్రయాలు జరుగుతున్నప్పటికీ అదేవిధంగా జనవాసాలు, ప్రధాన కూడళ్ళ వద్ద బడుల వద్ద, ప్రధాన కూడలి వద్ద కల్లు విక్రయాలు చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదని, కొంతమంది ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలు లేవని ప్రజలు విమర్శలు చేస్తున్నారు, ఇతర రాష్ట్రాలు లేదా పక్క జిల్లాల నుంచి కల్లులో కలిపే హానికరమైన పదార్థాలు కళ్ళు తయారు చేసే వారికి కొంత మంది, సరఫరా చేస్తున్నారని వీటి పై నిగా పెట్టాల్సిన అధికారులు అటువైపు పర్యవేక్షణ చేసి చూడటం లేదని ప్రజలు విమర్శలు చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








