V1News Telangana

best news portal development company in india

బొమ్మందేవ్ పల్లి గ్రామంలో మద్యం విక్రయించకూడదని ఏకగ్రీవ తీర్మానం చేసిన గ్రామస్తులు…..

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవ్ పల్లి గ్రామంలో బుధవారం రోజు గ్రామస్తులు కులాల వారీగా అందరూ కలిసి గ్రామంలోని చావిడి వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విచ్చలవిడిగా విక్రయించడం వలన గ్రామస్తులు పలువురు అధికంగా మద్యం సేవించి ఆరోగ్యాలు కోల్పోతూ అదేవిధంగా తమ కుటుంబాలలో కలహాలు ఏర్పడి జీవితాలు చిన్నాభిన్నం చేసుకుంటున్నారని.. గ్రామ పెద్దల దృష్టికి రావడం వలన గ్రామస్తులందరూ దీనిపై సుదీర్ఘంగా చర్చించి.. గ్రామ ప్రజల శ్రేయస్సు మరియు గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని గొప్ప ఆలోచనతో ఈ సమావేశంలో గ్రామంలో బెల్టు షాపులలో గాని, ఇళ్లల్లో కానీ మద్యం విక్రయించకూడదని తీర్మానించారు. ఒకవేళ ఎవరైనా తీర్మానం లో ప్రస్తావించిన విషయాలను బేకాతరు చేస్తూ మద్యం విక్రయించినట్లయితే వారికి గ్రామస్తులందరూ కలిసి రూ .లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గ్రామస్తులందరూ తీర్మానంపై కట్టుబడి ఉండాలని గ్రామ పెద్దలు సూచించారు. గ్రామంలో ఎవరైనా దొంగచాటుగా మద్యం విక్రయించినట్లయితే ఆచూకీ తెలిపిన వారికి రూ.20,000 నగదు పారితోషికం అందిస్తామని తెలిపారు. ఈ విషయంపై గ్రామస్తులందరూ నిబంధనలకు కట్టుబడి ఉంటామని తెలుపుతూ సంతకాలు సేకరించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ గౌడ్, ఎం. కె .రెడ్డి ,కే సాయిలు, సంజీవ్ రెడ్డి, మహేష్, భాస్కర్, టి. లక్ష్మణ్, గంగారాం, రెడ్డి విట్టల్, రాములు, గూళ్ల గంగారం, లింగం, బాలకృష్ణ, శంకర్, నగరం రాములు, టి. పవన్ కుమార్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india