V1News Telangana

best news portal development company in india

సమర్థవంతంగా పాఠశాలల నిర్వహణపై కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు దృష్టి సారించాలి….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రాబోయే 3 నెలల కాలంలో 80 శాతం విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందాలి కాంప్లెక్స్ హెడ్మాస్టర్లకు నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

SHARE:

సమర్థవంతంగా పాఠశాలల నిర్వహణపై కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు దృష్టి సారించాలి….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

రాబోయే 3 నెలల కాలంలో 80 శాతం విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందాలి

కాంప్లెక్స్ హెడ్మాస్టర్లకు నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం ఎన్టిపిసి, నవంబర్ -04:

జిల్లాలోని పాఠశాలలను సమర్థవంతంగా నిర్వహించేందుకు హెడ్ మాస్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపెల్లి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని సమస్త స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు,మండల విద్య అధికారులకు, నోడల్ అధికారులకు ఎన్టిపిసిలో నిర్వహించిన ఒకరోజు వర్క్ షాప్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పాఠశాలలో విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందించే దిశగా పాటించాల్సిన పద్దతులు , టీ.ఎల్.ఎం విధానాల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ అందించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, పాఠశాలల సమర్థ నిర్వహణ స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుల పటిష్ఠ పర్యవేక్షణతోనే సాధ్యమవుతుందని అన్నారు . పాఠశాలల్లో గుణాత్మక విద్య మెరుగుపరచడానికి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుల పర్యవేక్షణ గురించి కీలకమైన సూచనలు కలెక్టర్ అందించారు. రాబోయే మూడు నెలల కాలంలో జిల్లాలో 80 శాతం మందికి పైగా విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. మాధవి, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త పిఎం షేక్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india