Post Views: 155
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు ఆదివారం రోజు సాయంత్రం ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ ఎస్ఐ సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వారి జీవితాలు మాత్రమే కాకుండా ఎదుటివారి జీవితాలు కూడా చిన్న విన్నమవుతున్నాయని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎదుటివారికి చాలా నష్టం జరుగుతుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ను కఠినంగా తీసుకొని ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








