Post Views: 106
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: భవన నిర్మాణ రంగాల కార్మికులు అందరూ ఏకమై తమ హక్కులను సాధించుకోవాలని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్ కార్మికులకు సూచించారు. ఆదివారం రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సెంట్రింగ్ యూనియన్ ఆఫీస్ లో భవన నిర్మాణ రంగాల కార్మికుల సమావేశం నిర్వహించారు. కమల ఐలన్న నాయకత్వంలో గత 25 సంవత్సరాల నుండి కార్మికుల సమస్యల పైన ఉద్యమాలు చేస్తూ సమస్యలను పరిష్కరించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ వివిధ రంగాల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








