V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
బాన్సువాడ నియోజకవర్గం: పోతంగల్ మండల కేంద్రంలో నిర్వహించిన PSR &KBR వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రథమ బహుమతి గెలుపొందిన పోతంగల్ గ్రామానికి చెందిన టీం సభ్యులకు మరియు ద్వితీయ బహుమతి గెలుపొందిన సులేమాన్ ఫారం టీం సభ్యులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. క్రీడలు ఆడడం వల్ల శారీరక దారుఢ్యం, ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








