V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని పలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆదివారం రోజు ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారులు..ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రారంభించారు. దేశాయిపేట్, చందూర్ PACS పరిధిలో, పోతంగల్ మండలం PACS పరిధిలోగల జల్లపల్లి ఫారం గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అధికారులు, రైస్ మిల్లర్ యాజమాన్యాలు త్వరితగతిన వడ్ల కొనుగోలు నిర్వహించాలని సూచించారు. రైతులు అధైర్యపడవద్దని.. ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు, ఆయా సొసైటీ ల చైర్మన్లు మరియు ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








