V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజు గ్రామస్తులందరూ కలిసి బారెడు పోచమ్మ తల్లికి అందంగా బోనాలు అలంకరించి డప్పు చప్పులతో ఆటపాటలతో ఊరేగింపుగా వెళ్లి.. ధూప దీప నైవేద్యాలు, ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు అయినాల లింగం, కూని సాయా గౌడ్, జమాల్ పూర్ లింగం, గ్రామ మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్ మాట్లాడుతూ అమ్మవారికి ప్రతి సంవత్సరం దీపావళి పండగ అనంతరం మంచి రోజు చూసుకుని ఘనంగా పండగ నిర్వహించుకుంటామని తెలిపారు. బారెడు పోచమ్మ అమ్మవారికి చాలా నియమ నిష్టలతో పూజలు నిర్వహించాలని అన్నారు. అమ్మవారికి కేవలం తీపి నైవేద్యాలు, పిండి వంటలు మాత్రమే సమర్పిస్తామని తెలిపారు. అమ్మవారిని అనాదిగా మా పెద్దల నుండి పూజిస్తూ వస్తున్నామని అన్నారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం గ్రామస్తులు అమ్మవారిని పూజించడంలో నిర్లక్ష్యం చేయడం వలన దాదాపు గ్రామంలో ప్రజలందరికీ మరియు పశువులకు సైతం తీవ్రమైన జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలడం వలన అప్పటినుండి ప్రతి సంవత్సరం అమ్మవారిని మరిచిపోకుండా ఘనంగా బోనాలు అలంకరించి మొక్కులు చెల్లించుకుంటున్నామని తెలిపారు. అమ్మవారి కృప వల్ల గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో, పాడిపంటలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కూని మహేందర్ గౌడ్,అల్లం గంగారం, అరిగె మధు, బొడిగె భాను ప్రకాష్ గౌడ్, కూని చిన్న సాయ గౌడ్, అరిగె నారాయణ, దైతలి రాజు గౌడ్ ,మంగలి రాములు, కర్ణం సాయిలు, మామిడి భూమయ్య, చుంచు వెంకన్న, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








