V1News Telangana

best news portal development company in india

పట్టభద్రుల సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ అభ్యర్థి…..

SHARE:

-విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా కృషి చేస్తా

-పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో తన గొంతు ద్వారా వినిపిస్తాను

-శాసనమండలి రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా తయారైంది

-ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలోని హన్సిప్రియ ఫంక్షన్ హాల్ లో ఆదివారం రోజు ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు.. పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో తన గొంతు ద్వారా వినిపిస్తానన్నారు. ప్రస్తుత పరిస్థితులలో శాసనమండలి రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా తయారైందని ఆయన ఆరోపించారు. పట్టభద్రులు విద్యావంతులు కావున మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకొని తనను ఎన్నుకొని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ ఎంఈఓ నాగేశ్వరరావ్, నియోజకవర్గానికి చెందిన పలువురు ఉపాధ్యాయులు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india