-ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
-కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని
-ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివ నగర్ మండలంలోని కుప్రియాల్ గ్రామంలో శనివారం రోజు ఎమ్మెల్యే మదన్మోహన్ రావ్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అధికారులు మరియు రైస్ మిల్లర్లు జాప్యం జరగకుండా త్వరితగతిన వడ్లు కొనుగోలు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








