-విద్యార్థి దశ నుండే సామాజిక అంశాలపై జ్ఞానం పెంపొందించుకోవాలి
-విద్యార్థులు తోటివారి పట్ల సేవా భావం కలిగి ఉండాలి
-జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: విద్యార్థులు HIV (ఎయిడ్స్) వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సూచించారు. శనివారం రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా HIV (ఎయిడ్స్) నివారణ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు హెచ్ఐవి, టీవీ మరియు రక్తదానంపై జిల్లా స్థాయి రెడ్ రన్, క్విజ్ పోటీలు, నాటిక ప్రదర్శన పోటీలను నిర్వహించారు. ప్రథమ బహుమతి రూ.1000, ద్వితీయ బహుమతి రూ.750, తృతీయ స్థానంలో నిలిచిన వారికి బహుమతి రూ.500 అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుండి సామాజిక అంశాలపై జ్ఞానం సంపాదించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా హెచ్ఐవి వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యార్థులు ఇతరుల పట్ల సేవా భవాని కలిగి ఉండాలని అన్నారు. అత్యవసర పరిస్థితులలో అవసరం ఉన్నవారికి రక్తదానం కూడా అందించి ఆదుకోవాలని తెలిపారు. రక్తదానం అందించడం వల్ల ప్రాణాలను కాపాడిన వారవుతారని తెలియజేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








