Post Views: 25
V 1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ను శనివారం రోజు జిల్లా ఎస్పీ సింధు శర్మ వార్షిక తనిఖీలలో భాగంగా ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఎస్సై బొజ్జ మహేష్ పుష్పగుచ్చాన్ని అందించి ఎస్పీకి ఘనంగా స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్, సిఐ ఆఫీసును తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పనితీరు పట్ల ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. కేసులను తత్వంగా పరిష్కరించాలని తెలిపారు. పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, వాహనాల తనిఖీలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..