-రైతులు ఆందోళన చెందవద్దు
-వరి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి
-రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని రైస్ మిల్లర్లకు సూచన
-ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుంది
-ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా:కామారెడ్డి మరియు నిజామాబాద్ జిల్లాల పరిధిలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అందుకు సంబంధించి రైస్ మిల్లర్లకు అలాట్మెంట్ చేయడం జరిగిందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబధిత శాఖ అధికారులకు సూచించారు. అదేవిధంగా రైతులు కూడా అధికారులకు సహకరించాలని సూచించారు.ఈ విషయంపై శనివారం రోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మరియు సంబంధిత అధికారులతో పోచారం శ్రీనివాసరెడ్డి చర్చించారు.ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ….రైతులు ఎవ్వరూ కూడా అధైర్య పడవద్దని పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. నాణ్యత ప్రమాణాలను పాటించి, కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పొందాలని పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు.
ఈ విషయం గురించి శనివారం రోజు పోచారం శ్రీనివాసరెడ్డి వారి స్వగృహంలో రైస్ మిల్లర్ల తో సమావేశం నిర్వహించి.. రైతులకు ఇబ్బంది కలగకుండా వరిధాన్యం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్, ఇండస్ట్రీస్ ఛైర్మెన్ కాసుల బాలరాజ్,మాజీ జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజి రెడ్డి, బాన్సువాడ సొసైటీ అధ్యక్షులు ఎర్వల కృష్ణా రెడ్డి, బుడ్మి సొసైటీ అధ్యక్షులు గంగారం,బుడ్మి మాజీ సొసైటీ అధ్యక్షులు పిట్ల శ్రీధర్, బుడ్మి సొసైటీ వైస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, రైస్ మిల్లర్లు నాగులగామ వెంకన్న, సంతోష్ ,ఎల్లారెడ్డి,ఇతర రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








