V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలం లోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని తేదీ 02-11-2024 నుండి 01-12-2024 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు.09-11-2024 నాడు శ్రావణ నక్షత్రం సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు.15-11-2024 నాడు కార్తీక పౌర్ణమి పండగ సందర్భంగా ఆలయంలో సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణ మరియు ఏడు గంటలకు గరుడ వాహనంపై స్వామివారి రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఇట్టి దైవిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








