V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ పరిధిలో గల SRNK ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో ప్రథమ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న BA,BCOM,BSC విద్యార్థులకు శనివారం రోజు పరీక్ష రుసుము నోటిఫికేషన్ పరీక్షల నియంత్రణ అధికారి షేక్ అక్బర్ పాషా, ప్రిన్సిపాల్ డాక్టర్ టి. వేణుగోపాల్ స్వామి ల సమక్షంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ పరీక్షల నియంత్రణ అధికారి అంబయ్య మరియు ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు. విద్యార్థిని, విద్యార్థులు మరిన్ని వివరాల కొరకు కళాశాలలో సంప్రదించవలసిందిగా వారు పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ నవంబర్ 8, 2024 అని తెలిపారు.రూ.100 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ నవంబర్ 11, 2024 అని తెలియజేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








