V1News Telangana

best news portal development company in india

హోటల్ లో పేకాట ….

SHARE:

పేకాట స్థావరంపై పోలీసుల దాడి..

పేకాట రాయుళ్ళ వద్ద సుమారు లక్ష రూపాయలు స్వాధీనం ..?

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో ఆర్టీసీ బస్సు డిపో ప్రాంతంలో గల ఓ హోటల్ లో రూములను పేకాట స్థావరాలుగా ఏర్పాటు చేసుకుని ఆడుతున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు హోటల్ పై రెండు రోజుల క్రితం దాడులు నిర్వహించారు. పోలీసులు నిర్వహించిన దాడుల్లో రెండు రూములల్లో ఆడుతున్న పేకాటరాయుళ్ల వద్ద సుమారు లక్ష రూపాయలు నగదును స్వాధీనం చేసుకొని, ఏడుగురుని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పట్టుబడిన వారిలో అధికార పార్టీకి చెందిన నాయకులు ఉండడంవల్ల రెండు రోజులు గడిచిపోయినప్పటికీ పేకాట స్థావరంపై దాడికి సంబంధించి మరియు నగదు స్వాధీనం చేసుకున్న వివరాల గురించి ఎటువంటి వివరాలు బయటకు తెలియకపోవడం గమనార్హం. అదుపులోకి తీసుకున్న వారి పేర్లు కూడా గోప్యంగా ఉంచడం పట్ల.. పోలీసుల పని తీరుపై పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం ఇలా ఉండగా బాన్సువాడ పట్టణం లోని పలు కాలనీల్లో దీపావళి పండగ నేపథ్యంలో పేకాట స్థావరాలను ఏర్పాటు చేసుకొని ఆడిస్తున్నట్లు సమాచారం.ఈ పేకాట స్థావరాల నిర్వహణ అధికార పార్టీ నాయకులు యధేచ్చగా నిర్వహిస్తున్నట్టు వినికిడి.లక్షల రూపాయలు చేతులు మారుతున్న పోలీసులు పేకాట స్థావరాలను చూసి చూడనట్లు గా వ్యవహరించడం పట్ల ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా పోలీసు శాఖ ఉన్నత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india