V1News Telangana

best news portal development company in india

విచ్చలవిడిగా పేకాట స్థావరాలు……

SHARE:

-ఇష్టారీతిన పేకాట జరుగుతున్న పట్టించుకోని పోలీసులు

-స్థానికంగా ఎస్ఐ లేకపోవడంతో చూసి చూడనట్లు వదిలేస్తున్న అధికారులు

-పేకాట మోజులో పడి జీవితాలు చిన్నాభిన్నం చేసుకుంటున్న యువత

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

నసురుల్లాబాద్: దీపావళి పండుగ వచ్చిందంటేనే దీపాల పండుగను పక్కన పెట్టి పేకాట పండుగగా మారుస్తున్నారు అందులో భాగంగానే ఈ సంవత్సరం ఇష్టారీతిన పేకాటలు జరుగుతున్న సంబంధిత అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం విడ్డూరం స్థానికంగా ఎస్సై పోస్ట్ ఖాళీగా ఉండడంతో పోలీసులు ఇప్పటివరకు ఏ ఒక్క పేకాట స్థావరంపై కూడా దాడి నిర్వహించలేకపోయారు. వివిధ మండలాల్లో ఇప్పటికే పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి పలువురు పేకాటరాయుళ్ళను అదుపులోకి తీసుకొని నగదును స్వాధీనం చేసుకున్న ఘటనలు గత వారం రోజుల నుండి వినబడుతూనే ఉన్నాయి. కానీ నసురుల్లాబాద్ మరియు బీర్కూర్ మండల పరిధిలో విద్యుత్ స్తంభాల కింద, చెట్ల కింద, అద్దె గృహాలలో పేకాట విచ్చలవిడిగా జరుగుతున్నా కూడా ఇప్పటివరకు ఏ ఒక్కరిపై కేసు నమోదు కాకుండా.. ఒక్క రూపాయి నగదును కూడా స్వాధీనం చేసుకోలేరు. దీనిని బట్టి అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోయి ఉండి పేకాటను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారనడంలో సందేహం లేదని పలువురు పోలీసుల పనితీరుపై ఘాటుగా విమర్శిస్తున్నారు. జూదాన్ని అడ్డుకొని అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాల్సిన పోలీసు అధికారులే నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. దీనికి తోడు పలువురు ఇది దీపావళి సందర్భంగా పేకాట అనేది సర్వసాధారణం అంటూ ప్రజలు సంచరించే ప్రదేశాల్లో మాట్లాడుతున్నారని ఈ విషయం విన్న జనాలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఒక పక్క యువత మరియు పెద్దవాళ్లు అందరూ కూడా పేకాట మత్తులో పడి తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. సెల్ ఫోన్లు మొదలుకొని ద్విచక్ర వాహనాలు, కార్లు, చివరికి పంట పొలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను, భార్యల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను సైతం తాకట్టు పెట్టడం లేదా అమ్ముకోవడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతూ అదొక వ్యసనంగా ప్రతిరోజు పేకాట ఆడుతూ అప్పుల బాధలు భరించలేక భార్యాబిడ్డలను అనాధలుగా మార్చి చివరికి తనువులు చాలిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసు శాఖ అధికారులు పేకాట స్థావరాలపై దాడి చేసి పేకాటను నిర్మూలించకపోవడం పట్ల మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మండల వ్యాప్తంగా దొంగ చాటుగా నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి పేకాటను అరికట్టి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india