V1News Telangana

best news portal development company in india

దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణాదారులు తప్పకుండా సంబంధిత డివిజినల్ స్థాయి పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలి: ఇంచార్జీ సి.పి వెల్లడి*

SHARE:

*దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణాదారులు తప్పకుండా సంబంధిత డివిజినల్ స్థాయి పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలి: ఇంచార్జీ సి.పి వెల్లడి*

దీపావళి పండుగ సందర్బంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు వారి వారి సంబంధిత పోలీస్ డివిజినల్ అధికారి కార్యాలయం నుండి ధరఖాస్తు చేసుకొని అనుమతి పొందగలరు. దానికి సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజినల్ స్థాయి అధికారిని సంప్రదించగలరు.

ఎవ్వరయిన *సంబంధిత పోలీస్ డివిజినల్ స్థాయి అధికారి నుండి అనుమతిలేకుండా టపాకాయల దుకాణాలను నెలకొల్పినట్లయితే వారిపై ఎక్స్ ప్లోజివ్ యాక్టు -1884 మరియు రూల్స్ – 1933 సవరణ 2008 ప్రకారంగా కఠిన చర్యలు తీసుకొనబడును*.

*టపాకాయల దుకాణాదారులు తప్పక ఈ క్రింది నిబంధనలు పాటించాలి*

🔹 *టపాకాయల దుకాణాలు సంబందిత ఖాళీ ప్రదేశాలలో నెలకొల్పవలెను. ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్.ఓ.సి సర్టిఫికేటు పొందపర్చాలి*.

🔹 *ఒక క్లస్టర్ లో 50 షాపులకు మించరాదు*.

🔹 *జనరద్దీగల ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపుల ఏర్పాటు చేయరాదు. అదేవిధంగా కళ్యాణ మండపాలలో మరియు సమావేశాల కేంద్రాలలో టపాకాయల దుకాణాలు నెలకొల్పరాదు*.

🔹 *తాత్కాలిక టపాకాయల దుకాణాలలో ఫైర్ కు సంబంధించిన జాగ్రత్తలు తప్పక పాటించేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి*.

🔹 *ఇట్టి దరఖాస్తు ఫారం పోలీస్ వెబ్సైట్ www.nizamabadpolice.in లో ఆన్లైన్లో పొందపర్చడం జరిగింది. అట్టి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలతో సంబంధిత ఎ.సి.పి గారి కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవలెను*.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india