V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో మంగళవారం రోజు అట్ల బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను అలంకరించారు. మహిళలందరూ నూతన వస్త్రాలు ధరించి భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పూజిస్తూ ఎంతో ఉత్సాహంగా ఆటపాటలతో అందరూ కలిసి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆడపడుచు కూని గంగామని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అట్ల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులందరూ తమ పుట్టినిల్లుకు చేరుకొని ఆనంద ఉత్సాహాలతో పండుగను నిర్వహించుకుంటారని తెలిపారు. మహిళలందరూ నూతన వస్త్రాలు ధరించి అందరూ ఒకచోట చేరి పువ్వులను పూజిస్తూ ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామన్నారు. వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులను రజాకారులు వారి అహంకార పూరిత పరిపాలనతో తీవ్ర మైన కష్టాలకు గురి చేశారన్నారు. వారి అణచివేతకు గురై భయభ్రాంతులతో ఆనాడు ప్రజలు ప్రశాంతంగా జీవించేవారు కాదని అలాగే పండగలను కూడా సంతోషంగా జరుపుకునే వారు కాదని అన్నారు. రజాకారులను ఎదిరించి పోరాడి వారి నుండి ప్రజలందరికీ విముక్తి కల్పించిన త్యాగ వీరులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకుడు గొడిసెల నరసింహులు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ఆడపడుచులకు అందరికీ అట్ల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఆడపడుచులు అందరూ కలిసి రంగురంగు పువ్వులతో బతుకమ్మలను అలంకరించి.. నూతన వస్త్రాలను ధరించి బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో ఆనందంగా నృత్యాలు చేస్తుంటే చూడటానికి అందరికీ కన్నుల పండుగగా ఉందని అన్నారు. ఆడపిల్లలు ఇంటికి వెలుగు అని కొనియాడారు. దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా పువ్వులను సేకరించి పూజిస్తూ ప్రజలందరూ ఆనందంగా జరుపుకునే అరుదైన పండుగ అని అభివర్ణించారు. ఆడపడుచుల బతుకమ్మ ఆటపాటలను తిలకించడానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








