V1News Telangana

best news portal development company in india

రైస్ మిల్లులో  రేషన్ బియ్యం

SHARE:

రైస్ మిల్లులో  రేషన్ బియ్యం

డీలర్ల వద్ద కొంటూ రైస్ మిల్లులో నిలువ

రేషన్ షాపుల వద్ద బియ్యాన్ని కొంటున్న వైన్యం

గతంలో పలుమార్లు వార్తలు వచ్చినా కూడా ఆగని రేషన్ బియ్యం దందా

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం అక్టోబర్ 05:-

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గౌతమి నగర్ రామగుండం అంతర్గం పాలకుర్తి కొన్ని రైసుమిల్లలో అక్రమంగా పిడిఎస్ రైస్ కొని రైసు మిల్లులో నిలువ చేస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం. స్థానిక అధికారులకు సమాచారం తెలిసిన సరైన తనిఖీలు నిర్వహించడం లేదని పలువురు మండిపడుతున్నారు. 01 తారీకు నుంచి 10 తారీకు వరకు పేద ప్రజలకు అందించే వీడియోస్ బియ్యంను పది నుంచి 15 రూపాయలకు కొంటూ రైస్ మిల్లులో దాదాపు ఖని ప్రాంతాలలో ఉన్న అన్ని డీలర్ల వద్ద ఓ వ్యాపారస్తుని గుమస్తాలు ఎక్సెల్ బండిపై నెంబర్ ప్లేట్లు లేకుండా బియ్యాన్ని కొంటు ఆ బియ్యాన్ని ఖని చివర ఉన్న రైసుమిల్లులో నిలువ చేస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం. గతంలో పోలీస్ అధికారులు అక్రమ బియ్యాన్ని పట్టుకున్నప్పటికీ వారి వైఖరి మారడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి అయినా కూడా బియ్యాన్ని కొనడం అమ్మడం ఆగడం లేదు. నిలువ చేసిన బియ్యాన్ని అర్ధరాత్రి అక్రమ దారిలో ఇతర రాష్ట్రాలకు ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు గత కొద్ది రోజులుగా రేషన్ షాపుల వద్ద బియ్యాన్ని కొంటున్న దళారులు గతంలో ఇంటింటికి తిరుగుతూ కిలో 8 రూపాయల నుంచి పది రూపాయల వరకు కొనేవారు. కానీ ఈమధ్య రేషన్ షాపుల వద్ద 10 నుంచి 15 రూపాయలకు కొంటున్నట్లు విశ్వసనీయమైన సమాచారం. రామగుండం నియోజకవర్గం ప్రాంతాలలో ఉన్న రేషన్ షాపుల వద్ద అక్రమంగా దలారులు రేషన్ బియ్యాన్ని కొంటూ పోగు చేసుకొని ఇతర రాష్ట్రాలకు ఎక్కువ ధరాలకు అమ్ముతున్నారు. రేషన్ షాపుల వద్ద పాగా వేసి వారు తీసుకున్న వెంటనే దళారులు కొని దాన్ని నిలువ చేస్తూ ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ ఏ అధికారి కూడా తనిఖీలు నిర్వహించకుండా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నట్లు పరువు మేధావులు చర్చించుకుంటున్నారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వం రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నప్పటికీ దానిని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.అధికారులకు ఈ విషయం తెలిసిన కూడా ఏమీ పట్టనట్లు వ్యవహరించడం ప్రశ్నార్థకంగా మారింది. గత కొద్ది రోజులుగా ఇదే తంతు జరుగుతున్న స్థానికంగా ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ రామగుండం పోలీస్ అధికారులు స్పందించి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india