వార్డెన్లు లేరు విద్యార్థులే చదువుకుంటున్నారు
బీసీ హాస్టల్ వార్డెన్ నిజామాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ బాన్సువాడ నుంచి అప్ అండ్ డౌన్
విద్యార్థులకు వాచ్మెన్లు దిక్కు
అందాకారంలో వసతి గృహ విద్యార్థులు
సమస్యలకు నిలయంగా మారిన బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్
కోటగిరి లో బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్
సమస్యల పరిష్కారంలో పాలకులు అధికారులు విఫలం
కోటగిరి..
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారిందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు, సమస్యలకు నిలయంగా వసతిగృహాలు మారాయని వీటి గురించి పట్టించుకునే పాలకులు అధికారులు లేరని ప్రజలు మండిపడుతున్నారు, ఎస్సీ హాస్టల్ వార్డెన్ బాన్సువాడ నుంచి అప్పడం చేస్తారని, బీసీ హాస్టల్ వార్డెన్ నిజాంబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు, స్థానికంగా వార్డెన్లు లేకపోవడంతో విద్యార్థులే చదువుకుంటున్న వైనం నెలకొంటుంది, వాచ్మెన్ వారికి దిక్కుగా మారుతున్నారు కుళ్లిపోయిన కూరగాయలతో విద్యార్థులకు వంట వండుతున్న దృశ్యం పలువురికి నీవేరపరుస్తుంది, వార్డెన్లు అందుబాటులో లేకపోవడంతో టీవీలో సినిమా పాటలతో విద్యార్థులు చట్ట పట్టాలు వేస్తున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు, ప్రభుత్వ పాఠశాల గేటు నుంచి హాస్టల్కు వెళ్లే మార్గం సరిగా లేదని గుంతల మయంగా ఉందని అదేవిధంగా వీధిలైట్లు లేకపోవడంతో అంధకారంలో విద్యార్థులు ఉంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. విద్యార్థులు దోమలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు, ఎస్సీ హాస్టల్ శిథిలావస్థకు చేరడంతో పెచ్చులు వుడిపోవడం వర్షాకాలం వస్తుందంటే వర్షపు నీటితో ఎస్సీ హాస్టల్ గదులు వర్షపు నీటితో నిండిపోతున్నాయని దీంతో వర్షపు నీటిలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థులు వాపోతున్నారు, హాస్టల్ భవనం పై పెచ్చులూడి మీద పడడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో విద్యార్థులు భయం పరిస్థితిలో ఉంటున్నారు. ఎస్సీ హాస్టల్లో కేవలం 5 మాత్రమే టాయిలెట్స్ అదేవిధంగా బాత్రూం ఉండడం వల్ల అవి సరిపోక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, 90 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థులు తెలుపుతున్నారు, ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు కింద మంచం కు ఫ్యాన్ లేక అనేక ఏళ్ల క్రితం కింద ఉన్న ఫ్యాన్లు చెడిపోవడంతో ఫ్యాన్ లేక అనేక ఇబ్బంది ఎదుర్కొంటూ దోమలలో కాలం వెళ్లదీస్తున్నారు, ఈ సందర్భంగా సబ్ కలెక్టర్కు విషయం గురించి చెప్పగా సమస్యల గురించి నోట్ చేసుకున్నారు, అదేవిధంగా బీసీ హాస్టల్ వార్డెన్ ఫోన్ ద్వారా వివరణ కోరగా తనకు సర్జరీ అయిందని గత నాలుగు సంవత్సరాల నుంచి తాను హాస్టల్ లో పనిచేస్తున్నా అని అప్పటినుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నానని పేర్కొన్నారు, రూమ్ కన్వీట్ లేక తీసుకోలేదని సమాధానం ఇచ్చారు, రాత్రిపూట విద్యార్థులకు నిఘా పెట్టవలసిన వార్డెన్లు స్థానికంగా ఉండకపోవడం విద్యార్థులు వద్ద, ఉండకపోవడం వల్ల రేపు భవిష్యత్తులో ఏమైనా జరిగితే ఎవరూ రెస్పాన్సిబిలిటీ అని ప్రజలు మండిపడుతున్నారు, దీనిపై పాలకులు అధికారులు దృష్టి పెట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








