V1News Telangana

best news portal development company in india

విద్యార్థులకు చితక భాదుతున్న పంతులు బోధన్ ఆచంపల్లి ప్రజ్ఞా ప్రైవేటు పాఠశాలలో విద్యార్థికి చితక బాదిన ఉపాధ్యాయులు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన విద్యార్థి అర్హత లేని వైద్యుని వద్ద కుట్లు వేయించిన వైనం ఇదే పాఠశాలలో అనేకసార్లు విద్యార్థులపై అతి కిరాతకంగా దాడులు

SHARE:

విద్యార్థులకు చితక భాదుతున్న పంతులు
బోధన్ ఆచంపల్లి ప్రజ్ఞా ప్రైవేటు పాఠశాలలో విద్యార్థికి చితక బాదిన ఉపాధ్యాయులు
తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన విద్యార్థి
అర్హత లేని వైద్యుని వద్ద కుట్లు వేయించిన వైనం
ఇదే పాఠశాలలో అనేకసార్లు విద్యార్థులపై అతి కిరాతకంగా దాడులు…

బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలోని ఆచంపల్లి ప్రజ్ఞ ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థికి చితక బాదిన వైనం జిల్లాలోని సంచలనగా మారింది, రక్తపు మడుగుల మధ్య తీవ్ర రక్తస్రావంతో ఉన్న విద్యార్థికి కొంత మంది చికిత్స కోసం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే అర్హత లేని వైద్యుని వద్ద తీసుకు వెళ్ళగా సదురు వైద్యుడు కుట్లు వేయించిన వైనం పలువురికి కంటతడి పెట్టించింది, ప్రభుత్వ ఆస్పత్రి పక్కనే పుట్టగొడుగుల అర్హత లేని వైద్యులు ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు, అర్హత లేని వైద్యులు టీకాలు గుల్కోస్ లు సెలూన్ ఇవ్వడంతో పాటు బెడ్లు సౌకర్యం ఏర్పాటుచేసి చికిత్సలు చేయిస్తూ, వేల రూపాయలు చికిత్స కోసం వచ్చిన వారి నుంచి, వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ఇకపోతే ప్రజ్ఞ రెసిడెన్షియల్ పాఠశాలలో గతంలో కూడా విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయని, ప్రతి సంవత్సరం దాడుల పరంపర తీవ్రంగా పాఠశాల లో కొనసాగుతున్నప్పటికీ వీటిపై నామాత్రపు చర్యలు తీసుకుంటున్నారు కానీ విద్యార్థులకు రక్షణ ఇవ్వడంలో పై స్థాయి అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు ఇకపోతే బోధన్ పట్టణంలో ప్రభుత్వ పాఠశాల చుట్టుపక్కన తో పాటు పట్టణంలో సుమారు 30 నుంచి ఆపై అర్హత లేని వైద్యులు పుట్టగొడుగుల ఆసుపత్రులు నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత వైద్యశాఖ అధికారులు వీటిపై చర్య తీసుకోలేకపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు, ఆస్పత్రిలో బెడ్ల సౌకర్యం ఏర్పాటు చేస్తూ ఇంజక్షన్లు ఇస్తూ, సర్జరీ పనులు కూడా చేస్తున్నారని కుట్లు వేస్తున్నారని నిబంధనకు విరుద్ధంగా వైద్య చికిత్సలు అందిస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాటుతున్నారని పలువురు మండిపడుతున్నారు.

పోతంగల్ మండలం తిరుమలాపూర్ క్యాంప్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థిపై ఓ టీచర్ విచక్షణ రైతంగా దాడి చేయడంతో వారి యొక్క తల్లిదండ్రులు వచ్చి సదురు టీచర్ పై మండిపడ్డారు, ఈ సందర్భంగా టీచర్ తో పాటు హెడ్మాస్టర్ కు నిలదీయడం జరిగింది, ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ కు వివరణ కోరగా మామూలుగా హోంవర్క్ చేయకపోవడంతో వీపు మీద కొట్టడం జరిగిందని తల్లిదండ్రులు వస్తే వారికి నచ్చజెప్పమని సమాధానం ఇచ్చారు, ఈ సందర్భంగా ఎంఈఓ నాగనాథ్కు వివరణ కోరగా బోధన్ ప్రజ్ఞ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి పై దాడి చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఈ విషయం జిల్లా శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని సమాధానం ఇచ్చారు, తిరుమలాపూర్ క్యాంప్ గ్రామంలో జరిగిన విద్యార్థి పై దాడి విషయం తన దృష్టికి రాలేదని ఎంక్వయిరీ చేస్తానని, ప్రతి మండలానికి ఎంఈఓ అయ్యారని, సమాధానం ఇచ్చారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india