V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలంలోని రైతు నగర్ గ్రామంలో గల రైతు వేదిక లో శనివారం రోజు మిషన్ భగీరథ శాఖ డి ఈ వెంకటేష్ గౌడ్ మరియు బీర్కూర్ మండల ఏఈఈ జగదీష్, నసురుల్లాబాద్ మండల ఏఈఈ అశ్విని ల ఆధ్వర్యంలో ఉభయ మండలాలలోని గ్రామాల నుండి గ్రామానికి ఒక్క నీటి సహాయకుని చొప్పున అన్ని గ్రామాల నుండి సేకరించి నాలుగు రోజులపాటు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం రోజు చేతిపంపు పై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షకులు సాయిలు మరియు హైమద్ చేతిపంపు లో ఉండే భాగాల గురించి.. అదేవిధంగా మరమ్మత్తు ఏర్పడినప్పుడు అందులో బిగించే సామాగ్రి మరియు దాని విధానం గురించి క్లుప్తంగా వివరించారు. ఈ క్రమంలో వారు మంచినీటి సహాయకులు అడిగే సందేహాలకు సమాధానం ఇస్తూ చక్కగా వివరించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ శాఖ బీర్కూర్ మండల ఏఈఈ జగదీష్ మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడంలో కలిగే అంతరాయాలను అధిగమించడానికి మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు నిర్వహించి తద్వారా వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం “నల్ జల్ మిత్ర” ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు “మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు” దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. గ్రామాలలో నీటి సరఫరా వివిధ కారణాలవల్ల అంతరాయం కలిగినప్పుడు వాటిని ఏ విధంగా పరిష్కరించాలని విషయంపై మంచినీటి నాయకులకు శిక్షణలో మెలకువలు నేర్పుతున్నామని అన్నారు. స్థానికంగా ఉండే సహాయకులు చిన్నచిన్న మరమ్మత్తులను నిర్వహించి సత్వర పరిష్కారం చూపడం ద్వారా ప్రజలకు నీటి సరఫరా అందించడంలో జాప్యం జరగకుండా ఉంటుందని అన్నారు. మంచినీటి సహాయకులు శిక్షణా తరగతులలో అనుభవం గల శిక్షకులు తెలిపిన విషయాలను శ్రద్దగా విని నేర్చుకోవాలని కోరారు. తద్వారా నీటి ఎద్దడి సమస్యలు తలెత్తినప్పుడు త్వరితగతిన పరిష్కారాలు చేసుకునే విధంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి మంచినీటి సహాయకులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








