Post Views: 100
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి గ్రామీణ మండలం పరిధిలోని చింతల వాడి గ్రామానికి వెళ్లే రోడ్డు అద్వానంగా తయారయింది. చిన్నపాటి వర్షాలకే రోడ్డు మొత్తం గుంతలు పడి ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి బురదమయంగా తయారైందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు ద్విచక్ర వాహనాలపై మరియు కార్లలో ప్రయాణించడానికి భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు సౌకర్యంగా అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








