V1News Telangana

best news portal development company in india

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కి నివాళులర్పించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి…..

SHARE:

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో శుక్రవారం రోజు బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, స్వాతంత్ర సమరయోధుడు మరియు తెలంగాణ వాది స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల సమక్షంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా , తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అహర్నిశలు కృషిచేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india