Post Views: 88
V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామంలో శుక్రవారం రోజు గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన సంఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన వడ్డే తిమ్మయ్య అనే వ్యక్తి ఇంట్లో పేలుడు సంఘటన సంభవించింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద నీళ్లు వేడి పెట్టి మర్చిపోవడం వలన పొయ్యి అధికంగా వేడి కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి సిలిండర్ పేలిందని తెలిపారు. పెద్ద శబ్దంతో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన తిమ్మయ్య భార్యతో సహా బయటికి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయి దగ్ధమైందని తెలిపారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








