V1News Telangana

best news portal development company in india

భూమి భుక్తి విముక్తి సాధకురాలు చిట్యాల చాకలి ఐలమ్మ.

SHARE:

భూమి భుక్తి విముక్తి సాధకురాలు చిట్యాల చాకలి ఐలమ్మ.

– కాంగ్రెస్ డెలిగేట్ గంగా శంకర్.

భూమి భుక్తి విముక్తి సాధకురాలు చిట్యాల చాకలి ఐలమ్మ అని పీసిసి డెలిగేట్ గంగాశంకర్,బోధన్ ఏఎంసి చైర్ పర్సన్,కాంగ్రెస్ పార్టీ సాలురా మండల అధ్యక్షులు మందర్న రవి అన్నారు.గురువారం సాలురా మండల కేంద్రంలో చాకలి చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలను రజక సంఘం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆమె సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు.ఐలమ్మ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఏఎంసీ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన దంపతులకు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు.మహిళలు చాకలి ఐలమ్మ ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ఎందరో వారి వారి సమస్యలను పరిష్కారం చేసుకున్నట్లు గుర్తు చేశారు.తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బోధన్ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు,సాలురా పీఏసిఎస్ చైర్మెన్ అల్లె జనార్థన్,సీనియర్ నాయకులు అల్లె రమేష్,ఖజాపూర్ అశోక్,ఐడిసిఎంఎస్ డైరెక్టర్ రాజాగౌడ్,స్వామి గౌడ్,పాండు,శివకాంత్ పటేల్,డిస్కో సాయిలు,కేజీ గంగారాం,దాము,సాయరెడ్డి,రజక సంఘం సభ్యులు, కులస్తులు,మహిళలు,గ్రామస్తులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

P Nagnath
Author: P Nagnath

Saloora near cp office

best news portal development company in india