Breaking ; రైతుభరోస అమలుకు చర్యలు…
– రైతు భరోసాపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్య కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తీసుకువచ్చిన ఆరు గ్యారెంటీలలో (Congress Garentees) రైతు భరోసా ఒకటి. రైతు భరోసా పథకం కోసం ప్రతీఒక్క రైతు ఎదురుచూస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో రైతు భరోసాపై మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని మంత్రి ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రాచరిక పాలన నుంచి ప్రజా పాలన నిర్వహించుకుంటున్నామన్నారు. కొమురం భీమ్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, బద్దం ఎల్లా రెడ్డి, కాళోజి నారాయణ రావు, షాయబుల్లా ఖాన్ పోరాట స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామన్నారు. సంస్కృతి, సాంప్రదాయం కాపాడుతూ, భిన్నత్వంలో ఏకత్వం సాధించడమే ప్రభుత్వ కర్తవ్యమని స్పష్టం చేశారు.సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విద్య, వైద్య రంగానికి ప్రభుత్వం మొదటి ప్రాధ్యానం ఇస్తుందన్నారు. రుణమాఫీ చేసి రైతు సంక్షేమ ప్రభుత్వంగా చరిత్రలోకి ఎక్కిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించడానికి పట్టుదలతో ముందుకు సాగుతోందని వెల్లడించారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈకార్యక్రమంలో మంత్రి కొండా సురేఖతో పాటు కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా పాల్గొన్నారు.
Author: P Nagnath
Saloora near cp office








