Post Views: 115
సాలూర : హన్సా గ్రామానికి చెందిన కట్టేకళ్ల సంజు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై తన కొడుకుతో బోధన్ వెళుతుండగా జాతీయ రహదారి NH 63 కి అనుసంధాన అంతర్ రాష్ట్ర ప్రధాన రహదారిలో సాలూర వద్ద మహారాష్ట్ర నుండి బోధన్ వైపు వెళ్తున్న స్కార్పియో వాహనం సంజు ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చి వెనుక నుండి ఢీకొనడంతో సంజూ అక్కడికక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి పంచనామా నిమిత్తం మృతదేహాన్ని బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Author: P Nagnath
Saloora near cp office








