తగ్గేలీ రహదారి పక్కనే ఉన్న త్రివేది రైస్ మిల్లు నుంచి భారీగా దుమ్ము దూళి
అ వస్థల మధ్య సాలుర గ్రామ ప్రజలు పట్టించుకోని అధికారులు.
ఎన్నిసార్లు రైస్ మిల్ నిర్వాహకుని కి కోటేశ్వరరావుకు చెబితే ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అంటున్న గ్రామస్తులు భాస్కర్
దుమ్ము దులి నుంచి మాకు విముక్తి కల్పించండి
సాలు రా
నిజామాబాద్ జిల్లా సాలూరు నుంచి తగ్గేలీ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న త్రివేది ఆగ్రో రైస్ మిల్ నుంచి దుమ్ము దూళి భారీ సంఖ్యలో వస్తుందని ఈ దుమ్ము ధూళి అంతా, ప్రధాన రహదారి గుండా వెళ్లే వాహనపుదారులకు ప్రయాణికులకు ఇబ్బంది పాలు చేయడమే కాకుండా సాలూర గ్రామ ప్రజలకు తీవ్ర అవస్థలు చేస్తున్నది గ్రామస్తులు తో పాటు ప్రజలు పేర్కొన్నారు, అనేక ఏళ్ల నుంచి దుమ్ము ధూళి ఇండ్లలోకి చేరి అనేక వ్యాధుల బారిన పడుతున్నామని , ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ రైస్ మిల్ నిర్వాకుడు కోటేశ్వర రావు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. సంబంధిత శాఖ అధికారులు రైస్ మిల్ నిర్వహక్కుని వద్ద డబ్బులు తీసుకొని చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. టోటల్ సాలురా గ్రామం మొత్తం ఈ దుమ్ము దూళి వల్ల అవస్థల పాలు అయి రోగాల బారిన పడుతున్నారని ఇప్పటికైనా దీనిపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో గ్రామ ప్రజలంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని భాస్కర్ తో పాటు గ్రామ ప్రజలు హెచ్చరించారు.
సాలూరులో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం కోటేశ్వరరావు రైస్ మిలే కారణం
ప్రజలు హాట్ వ్యాధితో ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోవడం కారణం త్రివేది రైస్ మిల్ కోటేశ్వరరావు రైస్మిల్ కారణం
దుమ్ము ధూళి అన్నంలో పడుతుంది ముక్కు ద్వారా శ్వాస లో కి పోతుంది
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పట్టించుకోవాలి
రైస్ మిల్ ని తొలగించాలి లేదా కొత్త టెక్నాలజీతో రైస్ మిల్ నడపాలి
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించకపోతే
పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం
సాలూర గ్రామ సరిహద్దు ప్రాంతంలో ఉన్న కోటేశ్వరరావు రైస్ మిల్ నుంచి వచ్చే దుమ్ము ధూళి గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బంది పాలు చేస్తుందని, అన్నంలోకి దుమ్ము ధూళి పడుతుందని, ఈ దుమ్ము ధూళి అన్నంలోకి పడుతుందని ప్రజలు అలాగే తినడమే కాకుండా ముక్కు ద్వారా శ్వాసలకు వెళ్లి అనేకమంది హాట్ వ్యాధి తో పాటు శ్వాస కోసం ఊపిరితిత్తుల వ్యాధితో చాలామంది చనిపోతున్నారని, ఏదైనా బీమార్లు వచ్చి హాస్పిటల్ కి వెళ్ళిన వారంతా శవమై ఇంటికి వస్తున్నారని చాలామంది చనిపోవడానికి కారణం ఈ కోటేశ్వరరావుకు చెందిన రైస్మిల్ కారణమని, బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు సింగిడి పాండు అన్నారు, ఎన్నిసార్లు నిర్వాహకుడికి చెప్పినా అధికారులకు చెప్పిన మామూళ్ల మత్తులో మునుగుతున్నారు తప్ప దీని గురించి పట్టించుకోకపోగా ప్రజల ఆరోగ్యలతో చెలగాటమాడమే కాకుండా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కేవలం పైసాకు లాలుచి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన అన్నారు,
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దీని మీద స్పందించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు, ఈ రైస్ మిల్ ని తొలగించాలి లేక కొత్త టెక్నాలజీ తో రైస్ మిల్ ను నడిపించే విధంగా చూడాలని ఆయన అన్నారు. సాలూర గ్రామ ప్రజలు ఈ రైస్ మిల్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓట్లు వేసే యంత్రంగా పాలకులు వాడుకుంటున్నారు తప్ప ఈ సమస్య పరిష్కరించడంలో ఏళ్ల నుంచి పాలకులు పూర్తిగా విఫలమవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....