V1News Telangana

best news portal development company in india

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లను కలిసిన బాన్సువాడ నియోజకవర్గ నాయకులు

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆదివారం రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్ మున్షి మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలను వివరంగా వారికి తెలిపారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి కార్యకర్తలు నేడు నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల గురించి తెలియజేశారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించి.. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని అందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రతాప్ సింగ్ రాథోడ్, యలమంచిలి శ్రీనివాస్ రావ్, సోమశేఖర్ రావ్, విజయ్ కుమార్ (నందు) రెడ్డి, భాస్కర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india