V1News Telangana

best news portal development company in india

బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు…..

SHARE:

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: రుణమాఫీ కానీ రైతులు” చలో ప్రగతి భవన్ “పిలుపుమేరకు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రగతి భవన్ ను ముట్టడించి ఆందోళనలు చేపడతారని రాష్ట్ర ప్రభుత్వం అభద్రతాభావంతో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ముందస్తుగా బిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేయించారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు.. బాన్సువాడ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మరియు అతని అనుచరులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతులను నయవంచన చేసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 40 శాతం మంది రైతులకు మాత్రమే ప్రభుత్వం రుణమాఫీ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసేవరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఆగవని హెచ్చరించారు. అదేవిధంగా ఆరు హామీలను కూడా అన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే గొంతులను పోలీసు కేసుల పేరుతో భయబ్రాంతులకు గురిచేసి పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. అరెస్టు అయిన వారిలో చాకలి సాయిలు తదితరులు ఉన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india