V1News Telangana

best news portal development company in india

లింగంపల్లి తాండ లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం నిర్వహించిన గ్రామస్తులు…..

SHARE:

-గంగమ్మ ఒడికి చేరుకున్న గణనాథుడు

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని లింగంపల్లి తండాలో మంగళవారం 11వ రోజు సందర్భంగా జై సేవాలాల్ గణేష్ మండలి ఆధ్వర్యంలో.. గణనాధుని ప్రతిమను గ్రామ ప్రజలు పురుషులు, మహిళలు.. యువకులు, పిల్లలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆటపాటలతో, కోలాటం నృత్యాలతో ఒకే రకమైన దుస్తులను ధరించి అంగరంగ వైభవంగా గ్రామంలోని వీధుల గుండా మహిళలు అధిక సంఖ్యలో ప్రత్యేకంగా మంగళహారతులతో శోభాయాత్ర నిర్వహించారు. 11 రోజులపాటు పవిత్రమైన పూజలు అందుకున్న లడ్డు ప్రసాదం , సేపు, డబ్బుల హారం, పట్టు శాలువా లను భక్తులు వేలం పాటలో పోటీపడి కైవసం చేసుకున్నారు. లడ్డు వేలం అనంతరం డీజే చప్పుళ్ళు మరియు ఆటపాటలతో విఘ్నేశ్వరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం గ్రామంలో గల చెరువులో నిమజ్జనం నిర్వహించారు. గంగమ్మ ఒడిలోకి గణనాథుడు ప్రశాంతంగా చేరుకున్నాడు. గ్రామ ప్రజలను మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా కాపాడాలని విఘ్నేశ్వరుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎ.లక్ష్మణ్, రాథోడ్ రాజు, రాథోడ్ విట్టల్, రాథోడ్ మోహన్, రాథోడ్ అశోక్, రాథోడ్ రాము, ఎల్. దేవి, రాథోడ్ సర్దార్, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india