V1News Telangana

best news portal development company in india

ఎల్లారెడ్డిలో విఘ్నేశ్వరుడి నిమజ్జన ఏర్పాట్లను చెరువు దగ్గర పరిశీలించిన మున్సిపాలిటీ పాలకవర్గం….

SHARE:

V1 న్యూస్ ఎల్లారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి పట్టణంలో గల పెద్ద చెరువు వద్ద మంగళవారం రోజు 11వ రోజు సందర్భంగా విగ్నేశ్వరుడి ప్రతిమల నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం సభ్యులు ఏర్పాట్లను చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. ప్రతిమలను నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మున్సిపల్ శాఖ తరపున అన్ని రకాల ఏర్పాట్లను చేపట్టారు. అదేవిధంగా చెరువు వద్ద నిమజ్జనాలు నిర్వహించడానికి భారీ క్రేన్ ను అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు , అధికారులు, రెవిన్యూ సిబ్బంది, అగ్నిమాపక శాఖ సిబ్బంది, గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india