V1News Telangana

best news portal development company in india

బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు…..

SHARE:

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బిఆర్ఎస్ పార్టీకి చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీకి చెందిన శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో గురువారం రోజు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై దాడి చేసిన నేపథ్యంలో దాడిని నిరసిస్తూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి లు ఆందోళన చేపట్టగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరును ఖండిస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు హరీష్ రావ్ దాదాపు పదివేల మంది నాయకులు కార్యకర్తలు హైదరాబాద్ రావాలని పిలుపునివ్వడం జరిగింది. హరీష్ రావ్ పిలుపుమేరకు పార్టీ నాయకులు హైదరాబాద్ వెళ్తున్నారని ముందస్తు సమాచారం మేరకు ఒకవేళ వెళ్ళినట్లయితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఊహించి పోలీసులు బాన్సువాడలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు జుబేర్ మరియు అతని అనుచరులను.. నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరిలో గొడిసెల నరసింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, మోసిన్, మంగలి సాయికుమార్, దేశ్ పాక్ సాయిలు, దొంతి భాస్కర్ తదితరులు ఉన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india