-ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటాం
-నిమజ్జనానికి వెళ్లే మార్గాలలో విద్యుత్ తీగలు అడ్డు రాకుండా ఏర్పాట్లు చేయాలి
-బాన్సువాడ పట్టణ సీఐ మున్నూరు కృష్ణ
V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపాలను బుధవారం రోజు బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ తో కలిసి పట్టణ సీఐ మున్నూరు కృష్ణ సందర్శించి పరిశీలించారు. ఈనెల 17 మరియు 18 తేదీల్లో జరిగే వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జనం కొరకు శోభాయాత్రలో వెళ్లే మార్గాలను, కల్కి చెరువు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, విద్యుత్ శాఖ ఏఈ, డిఈ, పోలీసు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








