V1 న్యూస్ జుక్కల్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ చౌరస్తాలో బుధవారం రోజు కాటేపల్లి గ్రామానికి చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు సాగుచేసిన మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, పెసర పంటలు భారీ వర్షాల కారణంగా పంటలు ధ్వంసమై చేతికి అందకుండా పోవడంతో నష్టపరిహారం కొరకు అన్నదాతలు అందరూ కలిసి రోడ్లపైకి వచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకోవడమే శరణ్యమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు, ఉన్నతాధికారులు దీనిపై స్పందించి నష్టపరిహారం త్వరితగతిన చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వేల రూపాయల పెట్టుబడులు పంటలపై పెట్టి తీరా నూటికి అందవలసిన పంటలు నీటి పాలు కావడం పట్ల ప్రకృతి వైపరీత్యాలు తమను మరింత అప్పుల ఊబిలోకి నెట్టేసిందని వారు కంటతడి పెట్టుకున్నారు. అన్నదాతలు పెద్ద ఎత్తున రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడం వలన వందల సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికుల రాకపోగాలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. పోలీసులు ఆందోళనకారులను సముదాయించి రాస్తారోకోను నిలిపి వేయించారు. ఈ కార్యక్రమంలో రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








