-పి ఆర్ టి యు సంఘం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి ఉద్భవించింది
-పాఠశాలల అభ్యున్నతికి కూడా పాటుపడుతుంది
-ఉపాధ్యాయులు నిబద్ధత మరియు అంకితభావంతో విధులు నిర్వహించాలి
-పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్
V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రోజు పి ఆర్ టి యు నసురుల్లాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఆరుగురు ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి పూలమాలలు మరియు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.కుశాల్, మండల విద్యాశాఖ అధికారి పి. నాగేశ్వరరావ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్ మాట్లాడుతూ పిఆర్టియు సంఘం ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిష్కరించడంలో ఎల్లవేళల కృషి చేస్తుందని మరియు పాఠశాలల అభ్యున్నతికి పాటుపడుతుందని తెలిపారు. పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు గునిగెరి హన్మండ్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని మండలంలో గల ఐదుగురు ఉపాధ్యాయులను సన్మానించడం జరుగుతుందని తెలిపారు. సన్మానం పొందిన ఉపాధ్యాయులు పండరి గౌడ్ జెడ్పిహెచ్ఎస్ (నసురుల్లాబాద్), గురుదాస్ యుపిఎస్ ( మైలారం), అఫ్రోజ్ భాష యుపిఎస్ ఉర్దూ మీడియం (మిర్జాపూర్), మౌనిక పిఎస్ (బొమ్మందేవ్ పల్లి) , సత్యవ్వ పిఎస్ (లింగంపల్లి తండా), జ్యోతి పిఎస్ (రాముల గుట్ట తండా) ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు గునిగెరి హన్మండ్లు, ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్, రాష్ట్ర బాధ్యులు వెంకా గౌడ్, హనుమండ్లు యాదవ్, కే. శ్రీనివాస్, మండల బాధ్యులు సంజీవులు, శ్రీనివాస్ గౌడ్, సుజాత, ప్రధానోపాధ్యాయులు చందర్, ప్రేమ్ రాజ్ మరియు మండలంలోని వివిధ గ్రామాల పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








