నిజామాబాద్ జిల్లా సాలురా మండలం మంధర్నా గ్రామం నుండి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది.ఇసుక మాఫియా దారులు ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారు.గత ప్రభుత్వంలో ఇసుక అక్రమ రవాణా ఏ విదంగా కొనాసాగిందో ప్రస్తుత ప్రభుత్వం లో కూడా అదే విదంగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది…
అధికారులు మారిన ప్రభుత్వాలు మారినా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొందరు ఇసుక మాఫియా దారులు అధికారులను మచ్చిక చేసుకొని నాయకుల అండతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బోధన్ కు సబ్ కలెక్టర్ రావడంతో కొంత ఊపిరి పీల్చున్నారు ప్రజలు.ఇప్పటికైనా సబ్ కలెక్టర్ ఇసుక అక్రమ రవాణా ను అరికట్టాలని ఇసుక మాఫియా దారుల పనిపట్టాలని ప్రజలు కోరుతున్నారు.ఇసుక అక్రమ రవాణా చేసే వారిలో రిపోర్టర్లు కూడా ఉండడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించే హోదాలో ఉన్న రిపోర్టర్లే ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








