-యువకులు, పెద్దలు అందరూ కలిసి ఉత్సాహంగా పాల్గొన్న వైనం
-మండపాలలో కొలువుదీరిన లంబోదరుడు
-ఉండ్రాళ్ళు, పాయసం, పరమాన్నం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: వినాయక చవితి సందర్భంగా సకల విజ్ఞాలకు అధిపతి అయిన ఆదిదేవుడు విఘ్నేశ్వరున్ని.. పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడిని జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో మరియు పట్టణాల్లో యువకులు మరియు పెద్దలు భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పండుగను నిర్వహించుకున్నారు. ఇదే క్రమంలో శనివారం రోజు యువకులు ఉత్సాహంగా గణనాధుడిని కొలువు తీర్చడానికి మండపాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం వారు భజన పాటలతో మరియు డీజే చప్పులతో మూషిక వాహనుడికి ఘనంగా స్వాగతం పలికి ప్రతిమలను మండపాలలో ప్రతిష్టించారు. అనంతరం వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ఉండ్రాళ్ళు, పాయసం, పరమాన్నం, పులిహోర, దద్దోజనం వంటి పంచభక్ష పరమాన్నాలతో నైవేద్యం సమర్పించి అందరిని చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు ,పెద్దలు అధిక సంఖ్యలో ఆనందంగా పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








