-స్వామివారి ప్రతిమలు పంపిణీ చేసే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంది
-ప్రజలందరూ శాంతియుతంగా పండుగను నిర్వహించుకోవాలి
-మైనారిటీ నాయకుడు వినాయకుడి ప్రతిమలు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రజలు
-బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్
V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర ఆలయం మరియు పెద్ద హనుమాన్ ఆలయం ఆవరణలో శనివారం రోజు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాన్సువాడ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుని ప్రతిమలను పంపిణీ చేశారు. మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ వినాయకుడి మట్టి ప్రతిమలు పంపిణీ చేయడం పట్ల పట్టణ ప్రజలు ఆయన సేవా భావం పట్ల మరియు మన హిందూ దేవుళ్ళ పై ఆయనకున్న భక్తి పట్ల హర్షం వ్యక్తం చేశారు. వినాయకుని ప్రతిమలు అందుకున్న ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జుబేర్ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా స్వామివారి ప్రతిమలు పంపిణీ చేసే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పండుగను సుఖశాంతులతో, ఆనందంగా జరుపుకోవాలని కోరారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను ప్రతిష్టించి పూజించుకోవాలని సూచించారు. మత విద్వేషాలకు తావివ్వకుండా అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మోచి గణేష్, రమేష్ యాదవ్, చాకలి సాయిలు, యువ నాయకులు శివ సూరి, మౌల, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








