V1News Telangana

best news portal development company in india

విలేకరుల సమావేశం నిర్వహించిన బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు …..

SHARE:

V1 న్యూస్ వర్ని ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా: వర్ని మండల కేంద్రంలో శనివారం రోజు బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస రావ్, నసురుల్లాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ (నందు) రెడ్డి , బాన్సువాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ , రాష్ట్ర యువ నాయకులు భానోత్ రమేష్ నా ఆధ్వర్యంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ సభ్యత్వం చేస్తుంటే ఓర్చుకోలేని పోచారం శ్రీనివాసరెడ్డి వారి అనుచరులు లేని పోనీ అపోహలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులపై దొంగ కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు … అందరు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం చేసేది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికే నని తెలియజేశారు.. కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బంది తలపెట్టిన సహించేది లేదని హెచ్చరించారు… 40 సంవత్సరాలుగా కష్టనష్టాలకు ఓర్చి అప్పటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్ని భయభ్రాంతులకు గురిచేసిన పార్టీలు మారకుండా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయడం జరిగిందని అన్నారు. ఎంపీ ఎన్నికలలో ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసి బిజెపి పార్టీకి ఓట్లు వేయించడం జరిగింది అన్నారు.మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి కృషితో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కు బాన్సువాడ నియోజకవర్గం నుండి 9000 మెజారిటీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.ఎంపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి అదే పాత పద్ధతిలో కార్యకర్తలపై కేసులు పెట్టడం గురించి తీవ్రంగా ఖండించారు.. వారి వైఖరి మార్చుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేశారు మరియు ఎంపీ ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ కేటాయించినటువంటి ప్రొసీడింగ్ లను క్యాన్సిల్ చేయడం వారి హోదాకు తగదని తెలియజేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరింది నియోజకవర్గం అభివృద్ధి కొరకు మాత్రమే అని చెప్పుకునే పోచారం శ్రీనివాస్ రెడ్డి నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని తెలియజేశారు . రద్దు చేసినటువంటి ప్రొసీడింగ్ లను ఎంపీ దృష్టికి తీసుకెళ్లి సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి మళ్లీ తిరిగి అప్రూవ్ చేయిస్తామని కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడవద్దని తెలియజేశారు. ఈ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india