V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి గ్రామంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురై మృతి చెందిన గైని స్వాతి కుటుంబ సభ్యులను శుక్రవారం రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ వారి ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించి ఓదార్చారు. ఈ క్రమంలో ప్రమాదానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. స్వాతి మృతి పట్ల వారు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం మరియు బియ్యము అందజేశారు. అనంతరం మృతురాలి తండ్రి మీడియాతో మాట్లాడుతూ తనకు ఇద్దరు కుమార్తెలని 18 సంవత్సరాల వయసు నిండిన తన కూతురు మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదం జరిగిన సందర్భంలో కుటుంబ సభ్యులు ఎవరు లేరని తెలిపారు. ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నానని ఆయన అన్నారు. రేకుల ఇంట్లో నివాసముంటున్న ఈ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు జుబేర్ మాట్లాడుతూ స్వాతి మృతి చెందిన విషయం తెలవగానే మనసు తీవ్రంగా కలత చెందిందని అన్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా మృతి చెందిన ఈ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం నాచుపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కీసరి బద్రి కి మాతృవియోగం కలిగిందని తెలుసుకొని వారి ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. అనంతరం గ్రామంలోని కూడలి వద్ద రాముల గుట్ట తాండ నుండి రేషన్ బియ్యం తీసుకోవడానికి దాదాపు మూడు కిలోమీటర్లు నడిచి వచ్చి తీసుకెళ్తున్నామని తాండవాసులు వాపోయారు. సంబంధిత అధికారులతో మాట్లాడి .. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి తండాలో రేషన్ షాపు ఏర్పాటు చేయిస్తానని వారికి ఆయన హామీ ఇచ్చారు. అనంతరం నసురుల్లాబాద్ మండలంలోని బొప్పాస్ పల్లి తండాలో గత కొన్ని రోజుల క్రితం పశువులను మేపడానికి అడవికి వెళ్ళిన కీమ్యా నాయక్ అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. విషయాన్ని తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం మరియు బియ్యము అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబానికి చెందిన ఆయన మృతి చెందడం పట్ల కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని వాపోయారు. ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉండి వారి కుటుంబానికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణించిన వారికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం అందించినప్పుడు.. నష్ట పరిహారం సొమ్ము 5 లక్షల రూపాయలు సరిపోవని బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసి ఇప్పుడు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలోమోచి గణేష్, అఫ్రోజ్, భూమేష్, శివ సూరి, రమేష్ యాదవ్, అయ్యూబ్, నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు, మోసిన్, చుంచు శేఖర్, దేశ్ పాక్ సాయిలు, శంకర్, సాయి, అంజయ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








