V1News Telangana

best news portal development company in india

తెలంగాణ పిసిసి అధ్యక్షుడి నియామకం సందర్భంగా సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు…..

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు తెలంగాణ పిసిసి అధ్యక్షుడి గా ఉమ్మడి జిల్లా వాసుడైన మహేష్ కుమార్ గౌడ్ ను నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో వారు బాణాసంచా పేల్చి పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. తమ అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం మరియు నూతనంగా నియామకమైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ ను పిసిసి అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ అధిష్టానానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారని అన్నారు. ఆయన విద్యార్థి దశ నుండే రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ ఎన్ ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా విధులు నిర్వహించార ని గుర్తు చేశారు. అపారమైన రాజకీయ అనుభవం మరియు యువకుడు అయిన ఆయనను పిసిసి అధ్యక్షుడిగా నియమించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మరియు పిసిసి అధ్యక్షుడు ఇద్దరు యువకులు కావున వారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం రోజు వినాయక చవితి పండగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు మరియు నసురుల్లాబాద్ మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను అందరూ సుఖశాంతులతో ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. ఎటువంటి విద్వేషాలకు పాల్పడకుండా కలిసిమెలిసి నిర్వహించుకోవాలని కోరారు. అందరూ మట్టితో తయారుచేసిన వినాయకుని విగ్రహాలను ప్రతిష్టించి పూజించుకోవాలని సూచించారు. తద్వారా పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించినట్లు అవుతుందని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్, మాజీ జెడ్పిటిసి ప్రతాప్ సింగ్, పిఎసిఎస్ చైర్మన్ గంగారం, చుంచు సాయిలు, యూసుఫ్, చుంచు నారాయణ, శ్యామ్ నాయక్, ఇక్బాల్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ బొబ్బిలి గంగారం, మిర్జాపూర్ నాగు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india