V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం రోజు విద్యార్థులు ఎంతో ఆసక్తితో మట్టితో వినాయకుడి విగ్రహాలను తయారు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు మట్టితో వినాయకుడి విగ్రహాలు తయారు చేయడం వలన పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చని అవగాహన కల్పించారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కావున విద్యార్థులకు బాల్యం నుండే మన సంస్కృతి సంప్రదాయాలు.. పండగల యొక్క ప్రాముఖ్యత మరియు వివిధ రకాల రసాయనాలను వినియోగించి విగ్రహాలు తయారు చేయడం వలన నీరు, పర్యావరణం కాలుష్యం చెంది.. మూగజీవాలకు త్రాగడానికి నీటి కొరత ఏర్పడుతుందని తెలిపారు. మానవాళికి సైతం నీటి కొరత మరియు చర్మ వ్యాధులు సంభవించి తీవ్ర ఇబ్బందులకు గురికావలసి వస్తుందని సూచించారు. అనంతరం విద్యార్థులు విగ్రహాలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గునిగెరి హన్మండ్లు, ఉపాధ్యాయులు రుక్మిణి, అనూష, పుష్పలత, రూప, సురేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








